నాలుగు బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకుగాను ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు మరో రెండు బ్యాంకులపై భారీ స్థాయిలో జరిమానా విధించింది. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్‌పై రూ.97.80 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ.61.40 లక్షలు, ఐడీబీఐ బ్యాంక్‌పై రూ.31.8 లక్షలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై రూ.31.80 లక్షల చొప్పున విధించింది. కేవైసీ నిబంధనలు పట్టించుకోకపోవడం, సైబర్ సెక్యూరిటీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం వల్లనే జరిమానా విధించింది.