వారం రోజుల ముందు వరకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది. పసిడి ప్రియులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక, పేద.. మధ్య తరగతి వారి గురించి చెప్పక్కర్లేదు. బంగారం కొనాలనుకునే ఆశల్నే చంపేసుకునే పరిస్థితికి వచ్చారు. అయితే, లక్షకు చేరిన తర్వాత ఊహించని విధంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. హమ్మయ్యా.. ఇంకా కొంచెం తగ్గితే బంగారం కొనేద్దాం అనుకునేలోపే.. బంగారం బాదుడు మళ్లీ మొదలైంది. గత కొద్దిరోజులనుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు పెరిగాయి.
నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,730 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,750 రూపాయలు.. 10 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర 71,800 రూపాయలు ఉండింది. ఈ రోజు బంగారం ధర బాగానే పెరిగింది. గ్రాముపై ఒక రూపాయి చొప్పున 10 గ్రాములపై 10 రూపాయలు పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,740 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,760 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 71,810 దగ్గర ట్రేడ్ అవుతోంది.